కొత్త సినిమాకి సైన్ చేసిన శ్రీ విష్ణు !
Published on Dec 5, 2017 1:19 pm IST

నటుడు శ్రీవిష్ణు సినిమా సినిమాకి హీరోగా పరిణితిని పెంచుకుంటూ నిలదోక్కుకుంటున్నాడు. ఈ మధ్యే రామ్ సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’ లో మంచి నటన కనబరచిన అయన ఇటీవలే విడుదలైన ‘మెంటల్ మదిలో’ కూడా భిన్నంగా నటించి ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలు అందుకున్నారు. దీంతో ఆయనకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

తాజాగా ఈయన నారా రోహిత్ తో ‘అసుర’ సినిమాను చేసిన దర్శకుడు విజయ్ తో కూడా ఒక సినిమాకి సైన్ చేశారు. ఏ సినిమాకి ‘తిప్పరా మీసం’ అనే టైటిల్ ను ఖాయం చేశారు. ఇందులో హీరోయిన్ ఎవరు, సినిమా అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

 
Like us on Facebook