యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేసింది. ఏప్రిల్ 3 నుండి ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఇతర భాషల ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన లభిస్తుంది. కాబట్టి ఈ చిత్రం డిజిటల్ రంగంలో రాణించే అవకాశం ఉంది.
ఈ సినిమాలో రెబా మోనికా జాన్ కీలక పాత్రలో నటించగా, కాల భైరవ సంగీతాన్ని అందించాడు. సందీప్ గుణ్ణం మరియు వినయ్ చిలకపాటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో వీర్ ఆర్యన్ విలన్గా కనిపించాడు. మరి ఈ థ్రిల్లర్ మూవీ డిజిటల్ వేదికపై ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి
