కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘విష్ణు విన్యాసం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. శ్రీ విష్ణు బ్రాండ్ వాల్యూ కారణంగా ఈ సినిమా ఓటీటీ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి. యదునాథ్ మారుతీ రావు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా, నయన్ సారిక హీరోయిన్గా నటిస్తోంది.
అయితే, ఈ చిత్రాన్ని తొలుత ఫిబ్రవరి 28న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఈ రిలీజ్ డేట్‌ను మార్చారు. ఒక రోజు ముందుగానే, అంటే ఫిబ్రవరి 27న ఈ వినోదాల విందు థియేటర్లలో మొదలవుతుందని శ్రీ విష్ణు స్వయంగా వెల్లడించారు. టాలీవుడ్లో సాధారణంగా శుక్రవారం సినిమాలను విడుదల చేసే సంప్రదాయం ఉండటంతో ఈ మార్పు అనివార్యమైంది.
నిజానికి ఫిబ్రవరి 27న శ్రీ విష్ణు నటించిన మరో క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ’ విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ సినిమా వాయిదా పడటంతో, ఆ స్లాట్‌లోకి ‘విష్ణు విన్యాసం’ వచ్చి చేరింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
