విడుదల తేదీ : ఫిబ్రవరి 27, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : శ్రీవిష్ణు, నయన్ సారిక, గోపరాజు రమణ రాజు, బ్రహ్మాజీ, మురళీ శర్మ, సత్య తదితరులు
దర్శకుడు : ఎదునాథ్ మారుతీ రావు
నిర్మాత : సుమంత్ నాయుడు జి
సంగీత దర్శకుడు : రధన్
సినిమాటోగ్రాఫర్ : సాయి శ్రీరామ్
ఎడిటర్ : కార్తికేయన్ రోహిణి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మన టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే విష్ణు విన్యాసం. కామెడీ ప్రధానంగా వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేసిందో లేదో చూద్దాం రండి.
కథ:
తన జీవితంలో జాతకం, వాస్తు లాంటి పట్టింపులు పెట్టుకొని పెళ్లి కోసం ఎదురు చూసే ఓ జూనియర్ లెక్చరర్ గా పని చేస్తాడు విష్ణు (శ్రీవిష్ణు). కానీ ఇంకోపక్క తన జాతకంలో రెండు పెళ్లిళ్ల దోషం ఉందని పెళ్లి కాక జీవితంలో అవమానాలు ఎదుర్కొంటుంది మనీషా (నయన్ సారిక). మరి ఇలాంటి ఇద్దరి మధ్య ప్రేమ కుదిరితే ఎలా ఉంటుంది? ఇంతకీ ఆమె జాతకంలో ఉన్న దోషం వల్ల కలిగే నష్టం ఏంటి? అది నిజమా కాదా? చివరికి వీరి ప్రేమ కథ పెళ్లి వరకు వెళ్లిందా లేదా? వెళ్తే ఎలా ముగిసింది అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రంలో బిగ్గెస్ట్ ప్లస్ మాత్రం శ్రీవిష్ణు అనే చెప్పాలి. తన పెర్ఫార్మన్స్ కామెడీ టైమింగ్ తో తను సినిమాని తన భుజాలపై తీసుకెళ్లాడు. దాదాపు తనపై కామెడి సీన్స్ అన్నీ మంచి హిలేరియస్ గా అనిపిస్తాయి. తన కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే ట్యాగ్ కి ఈ సినిమాలో కూడా తాను న్యాయం చేశాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అలాగే హీరోయిన్ నయన్ సారిక కూడా ఈ సినిమాలో బాగుంది. డీసెంట్ లుక్స్ అలానే గ్లామర్ సీన్స్ లో కూడా ఆమె బాగుంది. శ్రీవిష్ణుతో సీన్స్ లో కూడా వీరి కెమిస్ట్రీ బాగుంది. అలానే వీరిద్దరి నడుమ ప్రీక్లైమాక్స్ లో రివీల్ అయ్యే లవ్ ట్రాక్ కూడా ఇంప్రెస్ చేస్తుంది. ఒకరినొకరు నిజంగా ప్రేమించుకుంటే వారు తమ ప్రియమైన వారి కోసం ఎంతవరకు వెళ్తారు అనే పాయింట్ ఇక్కడ బాగుంది. అలాగే ఒకింత ఎమోషనల్ గా కూడా నడిపించడం ఓకే అనిపిస్తుంది.
మెయిన్ లీడ్ తో పాటుగా కమెడియన్ సత్య మంచి నవ్వులు పూయించాడు. తనతో పాటుగా గోపరాజు రమణ రాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్యం రాజేష్ తదితరులు తమ పాత్రల్లో సెట్ అయ్యి బాగా చేశారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ అనేది పక్కన పెడితే మిగతా కాన్సెప్ట్ మరియు కథనం చాలా రొటీన్ ఫీల్స్ ని కలిగిస్తాయి. ఇది వరకే వచ్చిన పలు సినిమాల్లో కాన్సెప్ట్ నే తీసుకొని దానికి శ్రీవిష్ణు మార్క్ ఎంటర్టైన్మెంట్ ని యాడ్ చేయడం కొంచెం సేఫ్ అయ్యింది కానీ లేకపోతే ఈ సినిమా మరింత రెగ్యులర్ డ్రామాగా మిగిలిపోయేది.
హీరోయిన్ బ్యాక్ స్టోరీ అందులో డెప్త్ ఆస్తుల కోసం ఆమెని పెంచడం లాంటివి అనాది కాలం నుంచి వస్తున్న కాన్సెప్ట్ లు.. ఒక రచ్చ, యమదొంగ ఒక టైంలో రాధే శ్యామ్ లాంటి సినిమాలు కూడా ఇందులో గుర్తొస్తాయి. అలానే హీరో, హీరోయిన్ కి మొదటి పరిచయ సన్నివేశం ఇవన్నీ చాలా రొటీన్ గానే ఉంటాయి.
ఇక ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కొంచెం సాగదీత ఫీల్ కలిగిస్తుంది. అక్కడక్కడా కామెడీ సీన్స్ కొంచెం ఓవర్ గా అనిపిస్తాయి. అలా ప్రీ క్లైమాక్స్ కి వెళ్లే వరకు కొంచెం డ్రాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు ఓకే అని చెప్పొచ్చు. చిన్న చిన్న సీన్స్ లో కూడా వి ఎఫ్ ఎక్స్ పెట్టేసారు. అవి నాచురల్ గా లేవు. రధన్ సంగీతం తన రేంజ్ లో లేదు. చాలా బిలో యావరేజ్ గా ఉంది. సాయి శ్రీరామ్ కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది. కార్తికేయన్ రోహిణి ఎడిటింగ్ కూడా బాగానే కానీ సెకండాఫ్ లో ఇంకొంచెం టైట్ గా చేయాల్సింది.
ఇక కొత్త దర్శకుడు ఎదునాథ్ మారుతీ రావు విషయానికి వస్తే.. తను శ్రీవిష్ణు లాంటి హీరోని పెట్టుకొని ఎలా ఎంటర్టైన్ చేయాలో అందుకు ఏమాత్రం తగ్గకుండా ఎంటర్టైన్మెంట్ అందించారు. కానీ ఇదే క్రమంలో బలమైన కథ కథనాలు డిజైన్ చేసుకోలేదు. చాలా రొటీన్ లైన్, అండ్ సీన్స్ తో సినిమా నడిపించేసారు. వీటితో ఈ సినిమా ఆ పార్ట్ వరకు కొంచెం డల్ గా అనిపిస్తుంది. కానీ తను డిజైన్ చేసుకున్న లవ్ ట్రాక్ ఇంకా ఎమోషనల్ పార్ట్ మాత్రం వర్క్ అయ్యాయి కదిలిస్తాయి. ఓవరాల్ గా తన వర్క్ ఓకే అనుకోవచ్చు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ ‘విష్ణు విన్యాసం’లో శ్రీవిష్ణు తన కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే ట్యాగ్ కి తగ్గట్టే సాలిడ్ పెర్ఫార్మన్స్ తో ఎంటర్టైన్ చేస్తాడు. అలాగే ఇందులో దాదాపు కామెడీ సీన్స్ అన్ని వర్కవుట్ అయ్యాయి. అలానే ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా కొంచెం పికప్ అయ్యింది. కాకపోతే కొంచెం సాగదీతగా అనిపించే సెకండాఫ్, రొటీన్ కాన్సెప్ట్, కథనాలు ఇందులో బలహీనంగా అనిపించాయి. వీటిని పక్కన పెట్టి కేవలం ఒక శ్రీవిష్ణు ఎంటర్టైనర్ మాత్రం కావాలి అనుకుంటే ఇది ఓకే అనిపిస్తుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
