ఇటీవలే ‘బ్రోచేవారెవరురా’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు ఆ తర్వాత చేసిన ‘తిప్పరా మీసం’తో మాత్రం కొంత నిరుత్సాహానికి గురయ్యాడు. అయితే ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా బిజినెస్ పరంగా నిర్మాతలకు మంచి లాభాలే అందించింది. దీంతో శ్రీవిష్ణు తనకు కలిసొచ్చిన ఎంటర్టెయిన్మెంట్ జానర్లోనే తన జర్నీని కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నాడట.
అందుకే ‘బ్రోచేవారెవరురా’ తరహా స్క్రిప్ట్స్ కోసం చూస్తున్నారట. ఇప్పటికే ఆ జోనర్ లో కొన్ని కథలు విన్న ఆయన, ప్రస్తుతం ఇంకొంతమంది యువ దర్శకుల నుండి కూడా కథలు వినే పనిలో ఉన్నాడట. ‘బ్రోచేవారెవరురా’లాంటి స్క్రిప్ట్ దొరికితే వెంటనే ఆ డైరెక్టర్ ను లాక్ చేసేస్తాడట. సో.. ఇక పై శ్రీవిష్ణు నుండి మంచి హాస్యభరిత చిత్రాలను ఆశించవచ్చన్నమాట.
