ఫన్ రైడ్ గా శ్రీవిష్ణు “సామజవరగమన” గ్లింప్స్!

Published on Feb 28, 2023 11:00 am IST

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వం లో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సామజవరగమన. ఈ చిత్రం కి సంబంధించిన గ్లింప్స్ ను నేడు మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. 33 సెకండ్ల ఈ గ్లింప్స్ ఆసక్తికరం గా, ఫన్ రైడ్ గా సాగింది. శ్రీ విష్ణు కి లవ్ లో కొత్త ప్రాబ్లం ఉన్న విషయాన్ని వీడియో లో వెల్లడించారు.

అయితే గ్లింప్ తోనే సినిమా పై ఆసక్తి పెంచేశారు మేకర్స్. ఈ చిత్రం లో రెబా మోనికా హీరోయిన్ గా నటిస్తుండగా, జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. AK ఎంటర్ టైన్మెంట్స్ మరియు హాస్య మూవీస్ పతాకాల పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :