శ్రీజ మాజీ భ‌ర్త భ‌రద్వాజ్ క‌న్నుమూత‌

శ్రీజ మాజీ భ‌ర్త భ‌రద్వాజ్ క‌న్నుమూత‌

Published on Jun 19, 2024 12:01 PM IST

మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు, శ్రీజ మొద‌టి భ‌ర్త శిరీష్ భ‌రద్వాజ్ క‌న్నుమూశారు. గ‌త‌కొద్ది రోజులుగా ఆయ‌న ఊపిరితిత్తుల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుండ‌గా, బుధ‌వారం రోజున హైద‌రాబాద్ లోని ఓ ఆసుప‌త్రిలో మృతి చెందారు.

చిరంజీవి రెండో కూతురు శ్రీజ‌ను 2007లో ప్రేమించి పెళ్లి చేసుకున్న శిరీష్ భ‌ర‌ద్వాజ్, ఆ త‌రువాత ఆమెకు విడాకులు ఇచ్చాడు. వీరికి ఓ కూతురు ఉంది. అటుపై శిరిష్ మ‌రో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కాగా, శ్రీజ కూడా రెండో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు