పవర్ స్టార్ పవన్ కల్యాణ్, క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా విడుదలైన ‘శ్రీలీల అన్ఫిల్టర్డ్ ఇంటర్వ్యూ’ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ చిట్ చాట్‌లో పవన్ కల్యాణ్‌తో తన వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను శ్రీలీల పంచుకున్నారు. పవర్ స్టార్ ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీ గురించి ఆమె చెప్పిన విషయాలు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.
పవన్ యాటిట్యూడ్.. ఎంతో ఇన్స్పైరింగ్
సెట్స్‌లో పవన్ కల్యాణ్ ఎంతో ప్రశాంతంగా ఉంటారని శ్రీలీల స్పష్టం చేశారు. ఆయన షూటింగ్‌కు రాగానే అక్కడొక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుందని, పవన్‌ను చూసి తానూ పాజిటివ్ యాటిట్యూడ్ నేర్చుకున్నానని ఆమె తెలిపారు. పవర్ స్టార్ కేవలం సూపర్ స్టార్ మాత్రమే కాదని, ఆయనో గొప్ప ప్రకృతి ప్రేమికుడని శ్రీలీల కొనియాడారు. చుట్టూ ఉన్నవాళ్ల పట్ల ఆయన చూపించే కరుణ, దయ ఎంతో గొప్పవని వివరించారు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలని ఆయన పదే పదే ప్రోత్సహించే తీరు తనను ఎంతగానో ఇన్స్పైర్ చేసిందని ఆమె మనసులో మాట బయటపెట్టారు.
ఇక పవన్ కల్యాణ్ తిరిగి సినిమాలు చేయడం కేవలం అభిమానులకే కాకుండా, సినీ ఇండస్ట్రీ మొత్తానికి ఎంతో మేలు చేస్తుందని శ్రీలీల విశ్లేషించారు. మరోవైపు ఈ ఇంటర్వ్యూ ప్రోమోలో డైరెక్టర్ హరీష్ శంకర్, యాంకర్ సుమతో కలిసి పవన్ కల్యాణ్ శ్రీలీల మీద సెటైర్లు వేస్తూ ఫన్ క్రియేట్ చేసిన తీరు సినిమాపై మరింత బజ్‌ను పెంచింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్, ఉగాది కానుకగా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
