టాలీవుడ్ లో తమ కెరీర్ స్టార్ట్ చేసిన రీసెంట్ యంగ్ హీరోయిన్స్ లో ఆఫర్స్ అయితే బాగానే ఉంటున్నాయి కానీ అన్ని సినిమాల్లో సరైన హిట్స్ లేక స్ట్రగుల్ అయ్యేవారు కూడా చాలా మంది ఉన్నారు. మరి అలాంటి హీరోయిన్స్ లో ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ శ్రీలీల అలాగే భాగ్యశ్రీ బోర్సే కూడా ఒకరు.
ఇద్దరి కెరీర్ లో కూడా హిట్ కోసం తాపత్రయం తప్పలేదు. అయితే ఇంట్రెస్టింగ్ గా శ్రీలీల అందుకోవాల్సిన హిట్ టాక్ ని మాత్రం భాగ్యశ్రీ తీసుకుంది అని చెప్పొచ్చు. శ్రీలీల హీరోయిన్ గా మొదట ఎంపిక అయ్యి స్టార్ట్ చేసిన సినిమా ‘లెనిన్’ అఖిల్ అక్కినేని నుంచి సాలిడ్ టాక్ ని ఇపుడు సొంతం చేసుకుంది.
పాజిటివ్ టాక్ తో మొదలైన ఈ సినిమా విజయం శ్రీలీల ఖాతాలో పడాల్సింది కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ మన్ననలు అన్నీ భాగ్యశ్రీకి ఇపుడు సొంతం అవుతున్నాయి. సో లెనిన్ మాత్రం శ్రీలీలకి కాస్ట్లీ మిస్ అనే చెప్పుకోవచ్చు. అలాగే భాగ్యశ్రీ కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బ్రేక్ ఎట్టకేలకి వచ్చింది.
