క్రేజీ లుక్ తో ఛత్రపతి.. రిలీజ్ ఎప్పుడంటే ?

క్రేజీ లుక్ తో ఛత్రపతి.. రిలీజ్ ఎప్పుడంటే ?

Published on Mar 27, 2023 11:00 AM IST

బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ని శ్రీనివాస్ బెల్లంకొండ హీరోగా, వివి వినాయక్ దర్శకత్వంలో హిందీలోకి రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. పైగా ఎన్నో బ్లాక్‌ బస్టర్ చిత్రాలను అందించిన వినాయక్ నుంచి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా ఇది. ఇప్పటికే ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ రోజు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ని విడుదల చేసిన మేకర్స్, రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించారు. వేసవి సెలవులను పురస్కరించుకుని మే 12న ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

హిందీలో కూడా ఈ చిత్రానికి చత్రపతి అనే పేరు పెట్టారు. ఈ రోజు రిలీజ్ చేసిన ఫస్ట్-లుక్ పోస్టర్‌లో శ్రీనివాస్ షర్ట్ లేకుండా కండలు తిరిగిన బాడీతో వెరీ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఒక చేతిలో రాగి చెంబుతో శ్రీనివాస్ నీటిలో నిలబడిన స్టైల్ అండ్ స్టిల్ కూడా చాలా బాగుంది. పెన్ స్టూడియోస్‌ అధినేత డాక్టర్ జయంతిలాల్ గదా ఈ ప్రాజెక్ట్‌ ను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒరిజినల్‌ కథను అందించిన రాజమౌళి తండ్రి కె. వి. విజయేంద్ర ప్రసాదే ఈ రీమేక్ వెర్షన్‌కి కూడా రచయితగా పని చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు