హిట్ కాంబినేషన్ మళ్ళీ సెట్ అయ్యిందా ?

Published on Sep 27, 2021 4:26 pm IST

దర్శకుడు శ్రీను వైట్ల – మంచు విష్ణు కాంబినేషన్ లో రాబోతున్న సినిమా “డిడి (డబుల్ డోస్)”. 2007లో వచ్చిన ‘ఢీ’ సినిమాకి సీక్వెల్ రాబోతుంది ఈ సినిమా. ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయేల్, ప్రగ్యా జైశ్వాల్ ను హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో ఈ సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడు. అయితే, ఒకపక్క ఈ సినిమా చేస్తూనే.. మరోపక్క మరో హీరోతో సినిమాని శ్రీనువైట్ల ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

డిడి (డబుల్ డోస్) పూర్తి కాకముందే.. హీరో రామ్ తో శ్రీనువైట్ల ఒక సినిమా ప్లాన్ చేశాడట. రామ్ కూడా ఎప్పటి నుంచో శ్రీనువైట్లతో ఒక సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో శ్రీనువైట్ల రామ్ కి ఒక కథ చెప్పాడని.. రామ్ కి కథ నచ్చిందని.. వచ్చే ఏడాది వీరిద్దరి కలయికలో సినిమా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరి ఈ హిట్ కాంబినేషన్ సెట్ అయితే.. సినిమాకి క్రేజ్ ఉంటుంది.

సంబంధిత సమాచారం :