కమల్‌హాసన్ “విక్రమ్” సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్న హీరో నితిన్..!

Published on May 20, 2022 3:02 am IST

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “విక్రమ్”. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విలక్షణ నటులు విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, క్యామియో రోల్‌లో సూర్య కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్, ట్రైలర్ ప్రేక్షకులను చిశేషంగా ఆకట్టుకున్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చిత్ర రైట్స్‌ని టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సొంత నిర్మాణ సంస్థ అయిన శ్రేష్ట్ మూవీస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. టర్మరిక్ మీడియాతో అనుసంధానం ఎంతో ఆనందంగా ఉందని, మీరంతా ఎంతో ఎదురుచూస్తున్న కమల్ హాసన్ సార్ నటించిన విక్రమ్ సినిమా తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌లో జూన్ 3వ తేదిన గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుందని నితిన్ చెప్పుకొచ్చాడు. మరీ ఈ సినిమా నితిన్‌కి ఎలాంటి లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :