సమీక్ష : శ్రీ చిదంబరం గారు – రొటీన్ టెంప్లేట్‌తో సాగే లవ్ డ్రామా

Sri Chidambaram Garu

విడుదల తేదీ : ఫిబ్రవరి 06, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట, గోపీనాథ్, శివకుమార్ మట్ట, కల్పలత, అరుణ్ కుమార్, తులసి తదితరులు
దర్శకుడు : వినయ్ రత్నం
నిర్మాతలు: చింత వినీషా రెడ్డి, చింత గోపాల కృష్ణ రెడ్డి
సంగీతం : చందు రవి
ఛాయాగ్రహణం : అక్షయ్ రామ్ పొడిశెట్టి
కూర్పు : అన్వర్ అలీ

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

గత ఏడాది ‘క’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన నిర్మాణ సంస్థ శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నుండి వచ్చిన మరో చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’ (Sri Chidambaram Garu). కొత్త నటీనటులతో, డెబ్యూ డైరెక్టర్ వినయ్ రత్నం తెరకెక్కించిన ఈ సినిమా నేడు(ఫిబ్రవరి 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.

Sri Chidambaram Garu కథ:

రాజమండ్రి సమీపంలోని ఒక గ్రామంలో సోలమన్ అలియాస్ చిదంబరం(వంశీ తుమ్మల) తన తల్లితో కలిసి నివసిస్తుంటాడు. సోలమన్ ఒక భవన నిర్మాణ కార్మికుడు. అయితే, అతనికి మెల్ల కన్ను ఉండటంతో అతడిపై అందరూ జాలి చూపిస్తున్నారు అనే భావనతో జీవిస్తుంటాడు. తన లోపాన్ని ఎవరూ చూసి నవ్వుకోకూడదని ఎప్పుడూ నల్లటి కళ్లద్దాలు ధరిస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన లీల (సంధ్యా వశిష్ట) సోలమన్ మంచి మనసును చూసి ఇష్టపడుతుంది. కానీ, ఒక చిన్న పొరపాటు కారణంగా లీల తనను తిరస్కరించిందని సోలమన్ భావిస్తాడు. ఈ క్రమంలో తను తీసుకున్న నిర్ణయం ఏంటి? చివరకు తను కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని ఎలా తిరిగి పొందాడు? తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

మొదటి సినిమా అయినప్పటికీ వంశీ తుమ్మల సోలమన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఒక ఫిజికల్ డిఫెక్ట్ ఉన్న వ్యక్తి ఎదుర్కొనే మానసిక సంఘర్షణను తన నటనతో చాలా సహజంగా పండించాడు. లీల పాత్రలో సంధ్యా వశిష్ట చాలా చక్కగా నటించింది. ముఖ్యంగా గోదావరి యాసలో ఆమె చెప్పిన డైలాగులు, నటన ఆకట్టుకుంటాయి.

హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. వారి మధ్య వచ్చే లవ్ సీన్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి. ఇక హీరో కోసం హీరోయిన్ పడే బాధ కూడా చాలా చక్కగా చూపెట్టారు. ఇలాంటి నీట్ అండ్ క్లీన్ లవ్ స్టోరీ ఈ మధ్య సినిమాల్లో కనిపించలేదు.

ఈ సినిమాలోని సందేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ‘నిన్ను నువ్వు ప్రేమించుకోనప్పుడు, అవతలి వారు నిన్ను ప్రేమిస్తారని ఎలా ఆశిస్తావు?’ అనే పాయింట్ నేటి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. ఇక ఈ సినిమాలో పల్లెటూరి వాతావరణాన్ని, గోదావరి అందాలను కెమెరాలో చాలా అందంగా చూపించారు. విజువల్స్ చాలా ప్లెజెంట్‌గా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమా కథ చాలా స్లోగా సాగుతుంది. ఎమోషనల్ సీన్స్ పండించడానికి దర్శకుడు తీసుకున్న సమయం కొన్ని చోట్ల సాగతీతగా అనిపిస్తుంది. ఎలాంటి ఆసక్తికర అంశం లేకపోవడం ఈ సినిమాకు మేజర్ మైనస్. రొటీన్ అండ్ ఫ్లాట్ లవ్ స్టోరీని ఎంచుకోవడం ఆకట్టుకోదు.

సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్లను ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే సినిమా కొంతవరకు పర్వాలేదనిపించేది. పూర్తిగా క్యారెక్టర్ డ్రివెన్ సినిమా కావడం వల్ల, రెగ్యులర్ మాస్ ఎలిమెంట్స్ ఆశించే వారికి కొంత నిరాశ కలిగించవచ్చు.

చాలా పాయింట్స్ సింపుల్‌గా ఉండటం, మరికొన్ని సిల్లీగా ఉండటం కూడా సినిమాకు డ్యామేజ్ చేశాయి. కథను ఇంత సింపుల్‌గా తీసుకెళ్లడంతో ప్రేక్షకులకు ఎక్కడా ఎంటర్‌టైనింగ్ అంశాలు కనిపించలేదు.

సాంకేతిక విభాగం:

దర్శకుడు వినయ్ రత్నం ఎంచుకున్న కోర్ పాయింట్ బాగుంది. కథను ఎక్కడా పక్కదారి పట్టించకుండా నిజాయితీగా తెరకెక్కించాడు. కథకు అనుగుణంగా వచ్చే మ్యూజిక్ ఆకట్టుకుంది. ఈ సినిమాకు మేజర్ అసెట్‌గా సినిమాటోగ్రఫీ వర్క్ నిలిచింది. పల్లె అందాలను కెమెరాలో బంధించిన విధానం సూపర్. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

తీర్పు:

ఓవరాల్‌గా చూస్తే.. ‘శ్రీ చిదంబరం గారు’ (Sri Chidambaram Garu) ఒక సోల్ ఉన్న లవ్ స్టోరీగా వచ్చింది. ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ లవ్ అనే అంశాలను దర్శకుడు చాలా చక్కగా చూపించారు. నటీనటుల ప్రతిభ, మంచి సందేశం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. అయితే, చాలా సింపుల్ పాయింట్‌తో కథను నడిపించిన తీరు, స్లోగా సాగే పేస్ ప్రేక్షకులను మెప్పించదు. ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడే వారు ఈ సినిమాను ఓ సారి ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version