డైరెక్టర్ మారుతి క్లాప్ తో ప్రారంభమైన “శ్రీ శృంఖలా దేవి ఫిల్మ్స్” కొత్త చిత్రం!

డైరెక్టర్ మారుతి క్లాప్ తో ప్రారంభమైన “శ్రీ శృంఖలా దేవి ఫిల్మ్స్” కొత్త చిత్రం!

Published on Aug 30, 2021 5:05 PM IST

అర్జున్ కళ్యాణ్, వసంతి జంటగా శ్రీ శృంఖలా దేవి ఫిల్మ్స్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం.1 మూవీకి శ్రీకారం చుట్టింది. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవానికి డైరక్టర్ మారుతి ముఖ్య అతిథిగా హాజరై, ఫస్ట్ షాట్ కు క్లాప్ నిచ్చారు. కొత్త దర్శకుడు రామరాజు.జి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

చిత్ర కథను తెలుసుకొన్న దర్శకుడు మారుతి, స్టోరి చాలా క్రియేటివ్ గా బాగుందంటూ టీమ్ ని అభినందించారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతున్న ఈ మూవీ సింగిల్ షెడ్యూల్ లో పూర్తి కానుంది. రోడ్ ట్రిప్ బ్యాక్డ్రాప్ లో జరిగే ఈ థ్రిల్లర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుందని దర్శకుడు రామరాజు.జి. తెలిపారు. కొన్ని రియాలిస్టిక్ సంఘటన ల ఆధారం గా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి మురళీధర్ సింగు అందిస్తున్నారు. సంగీతం మహావీర్ యెలందర్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు