వరల్డ్ వైడ్ లో ‘శ్రీవల్లి’ హిందీ వెర్షన్ నయా రికార్డ్.!

వరల్డ్ వైడ్ లో ‘శ్రీవల్లి’ హిందీ వెర్షన్ నయా రికార్డ్.!

Published on Jan 28, 2022 9:00 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా “పుష్ప ది రైజ్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అయ్యింది. మరి ఈ సినిమా కంటెంట్ పరంగానే కాకుండా మ్యూజికల్ గా కూడా భారీ హిట్ అయ్యింది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ప్రతి సాంగ్ కూడా ఒక్క తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా చార్ట్ బస్టర్ హిట్స్ అయ్యాయి.

ఇక వాటిలో సెన్సేషనల్ హిట్ నెంబర్ ఏదన్నా ఉంది అంటే అది మెలోడీ సాంగ్ “శ్రీవల్లి” అని చెప్పాల్సిందే. ఈ సాంగ్ తెలుగు సహా హిందీలో భారీ హిట్ గా నిలిచింది. ఇక హిందీలో సాంగ్ అయితే ఎప్పుడో 100 మిలియన్ వ్యూస్ 2 మిలియన్ కి పైగా లైక్స్ న్నీ క్రాస్ చేసి బాలీవుడ్ సాంగ్స్ కే పోటీగా నిలబడగా లేటెస్ట్ గా ఈ సాంగ్ మరో ఫీట్ సెట్ చేసినట్టుగా టి సిరీస్ వారు తెలియజేసారు.

గత 24 గంటలు అంటే మొన్నటి 24 గంటల్లో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ లో అత్యధికంగా వీక్షించిన వీడియో ఏదైనా ఉంది అంటే అది శ్రీవల్లి హిందీ వీడియో సాంగ్ అని తెలియజేసారు. అంటే ఈ లెక్కన శ్రీవల్లి స్పీడ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనితో ఈ విషయాన్ని వారు తెలియజేయడంతో ఈ సాంగ్ మళ్ళీ హాట్ టాపిక్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు