ఇన్స్టా లో కూడా ‘శ్రీవల్లి’ సెన్సేషన్..బాలీవుడ్ సాంగ్స్ ని దాటి.!

Published on Jan 22, 2022 9:01 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ “పుష్ప”. థియేటర్స్ సహా ఓటిటి లో కూడా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం సెన్సేషన్ మాత్రం ఇంకా తగ్గలేదు. అయితే ఈ సినిమా భారీ హిట్ లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆల్బమ్ కూడా ఎంతో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

మరి తాను ఇచ్చిన చార్ట్ బస్టర్ సాంగ్స్ లో ‘శ్రీవల్లి’ సాంగ్ ఇంపాక్ట్ అయితే ఇంకా కొనసాగుతుంది. నిన్ననే క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సాంగ్ రీల్ తాను చేసినది రిలీజ్ చెయ్యగా అది ఓ రేంజ్ లో వైరల్ అవుతుండగా.. ఇదే ఇన్స్టాగ్రామ్ లో శ్రీవల్లి హిందీ వెర్షన్ సాంగ్ పలు బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ సాంగ్స్ ను కూడా దాటేసి ఏకంగా 1 మిలియన్ రీల్స్ రీచ్ అయ్యింది.

దీనితో ఏ హిందీ సాంగ్ కి కూడా లేని రికార్డ్ ఇప్పుడు శ్రీవల్లి ఖాతాలో పడింది. ఇది ఒకటే కాకుండా యూట్యూబ్ లో కూడా పుష్ప హిందీ సాంగ్స్ హవా చూపిస్తున్నాయి. ఆల్ మోస్ట్ అన్ని సాంగ్ 1 మిలియన్ లైక్స్ క్రాస్ చెయ్యడమే కాకుండా రికార్డు వ్యూస్ కూడా తెచ్చుకుంటున్నాయి. మొత్తానికి మాత్రం అల వైకుంఠపురములో తర్వాత మళ్ళీ పుష్ప తో బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ హిట్ ఆల్బమ్స్ అందుకున్నాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం :