షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘భళా తందనాన’..!

Published on Dec 23, 2021 2:10 am IST


యంగ్ హీరో శ్రీ విష్ణు, కేథరిన్‌ హీరో హీరోయిన్లుగా వారాహి చలన చిత్రం సంస్థ నిర్మిస్తోన్న సినిమా ‘భళా తందనాన’. చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ని కంప్లీట్ చేసుకుంది. ఈ విషయాన్ని వెల్లడించిన చిత్రబృందం శ్రీవిష్ణు ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేసింది.

అయితే రైల్వే ప్లాట్‌ఫాంపై రెండు చేతులతో తుపాకులు పట్టుకొని కొపంగా నిల్చున్న శ్రీవిష్ణు మాస్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతున్నట్లు ఫస్ట్‌లుక్‌ని చూస్తుంటే తెలుస్తుంది. ఇదిలా ఉంటే ‘కేజీఎఫ్‌’లో గరుడ పాత్రతో మంచి పాపులారిటీ సంపాదించిన రామ్‌ ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను ప్రారంభించామని, త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

సంబంధిత సమాచారం :