క్రైమ్ కామెడీతో రానున్న శ్రీ విష్ణు !

srivishnu interw

యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని ప్రధానంగా క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నాడు. ముఖ్యంగా శ్రీ విష్ణు క్యారెక్టర్ సినిమాలోనే హైలెట్ కానుందట. ఓ క్రైమ్ లో అనుకోకుండా ఇరుక్కున్న శ్రీ విష్ణు నుండి మంచి కామెడీ రానుందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన నివేత థామస్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ, సత్య దేవ్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. మన్యం క్రీయేషన్స్ పతాకం ఫై మన్యం విజయ్ కుమార్ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Exit mobile version