శ్రీ విష్ణు నెక్స్ట్ కి ఇంట్రస్టింగ్ టైటిల్

Published on Apr 5, 2022 1:00 pm IST


యంగ్ అండ్ ప్రామిసింగ్ టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన భళా తందనానా లో నటించనున్నారు. ఈ రోజు, నటుడు మరో కొత్త చిత్రానికి సంతకం చేశాడు. చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మించడంలో పేరుగాంచిన లక్కీ మీడియా సంస్థ బెక్కెం వేణుగోపాల్ ఈ కొత్త చిత్రానికి నిర్మాత.

అల్లూరి అనే టైటిల్ తో ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను ఆన్ లైన్ లో తాజాగా విడుదల చేశారు మేకర్స్. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ యాక్షన్ డ్రామాకి సంగీతం అందించడానికి అర్జున్ రెడ్డి ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఎంపికయ్యారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :