“శ్రీదేవి డ్రామా కంపెనీ” మాదంటే మాదంటూ ఫైట్..!

Published on Jan 5, 2022 2:06 am IST

తెలుగు బుల్లితెర‌ ప్రేక్షకులకు కడుపుబ్బా కామెడీని అందిస్తున్న కార్యక్రమాల్లో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కూడా ఒకటి. సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం 50వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టబోతుంది. తాజాగా ఈ ఎపిసోడ్‌కి సంబంధించి ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. ఈ షో మొదట స్టార్ట్ అయినప్పుడు ఉన్న టీమ్‌, ప్రస్తుతం ఉన్న టీమ్‌ ఈ షో మాదంటే మాదంటే ఫైట్ చేసుకోబోతున్నాయి.

ఈ క్రమంలో రెండు టీమ్‌ లు చేసిన కామెడీ ఫైట్ హిలేరియస్‌గా అనిపించింది. ఇక సుహాసిణి డ్యాన్స్‌తో అలరించగా, ఇంద్రావతి ఊ అంటావా.. ఊఊ అంటావా సాంగ్ పాడి కేక పుట్టించింది. ఇక చివరలో 6 ఏళ్ల అబ్బాయి వాయించిన బ్యాండ్ విజిల్స్ వేయించేలా ఉంది. మరీ ఈ ఫుల్ ఎపిసోడ్‌ను మిస్ కాకూడదంటే మాత్రం జనవరి 9వ తేది ఆదివారం మధ్యాహ్నం 1:00 గంటకు ఈటీవీని తప్పక చూడాల్సిందే.

ప్రొమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :