“శ్రీదేవి డ్రామా కంపనీ” ఈ వారం హైలెట్స్ ఇవే ఉండనున్నాయి!

Published on Aug 7, 2021 1:00 am IST


ఈటీవి లో వచ్చే కార్యక్రమాలు ప్రతి ఒక్కరినీ అలరిస్తూనే ఉన్నాయి. అయితే శ్రీదేవి డ్రామా కంపనీ తో అటు క్లాస్, ఇటు మాస్ ఎంటర్ టైన్మెంట్ ను అందించడం జరుగుతుంది. అయితే ఈ ఆదివారం మధ్యాహ్నం వంటిగంట కి శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రేక్షకులను కట్టిపడేయ నుంది అని చెప్పాలి.

వరుస స్కిట్ లతో మాత్రమే కాకుండా, పాటలతో కూడా హుషారైన సంగీతం ను అందిస్తోంది. అయితే ఈ ప్రోగ్రాం లో రామ్ ప్రసాద్, సుధీర్, హైపర్ ఆది లు చేసిన స్కిట్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. అంతేకాక ప్రోమో లోని చివరి సీన్స్ లో కోవిడ్ సమయం లో బాధితులకు, ప్రజలకు సేవ చేసిన మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, సోనూ సూద్ వారిపై గెటప్ శ్రీను చేసిన పెర్ఫార్మెన్స్ హైలెట్ ఉంటుంది అని తెలుస్తోంది. అయితే వీరు ఈ ఆదివారం ఏం చేశారు అనేది తెలియాలంటే శ్రీదేవీ డ్రామా కంపెనీ ను చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :