‘శ్రీదేవి’ స్టేజ్ పై అన్నపూర్ణమ్మ 50 ఏళ్ల వేడుకలు..”పుష్ప” స్టెప్ తో బాబూమోహన్!

‘శ్రీదేవి’ స్టేజ్ పై అన్నపూర్ణమ్మ 50 ఏళ్ల వేడుకలు..”పుష్ప” స్టెప్ తో బాబూమోహన్!

Published on Feb 22, 2022 5:00 PM IST

మన తెలుగులో సాలీడ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఛానెల్స్ లో ఈటీవీ ఛానెల్ కూడా ఒకటి.. మరి వీరి ఛానెల్లో ప్రతి రోజు ఏదొక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రోగ్రాం ఉండనే ఉంటుంది. అలా ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే షో నే “శ్రీదేవి డ్రామా కంపెనీ” కూడా ఒకటి. సుధీర్ వ్యాఖ్యాతగా చేసే ఈ షో ప్రతి ఆదివారం టన్నుల్లో ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది.

మరి అలా ఈసారి వచ్చే ఆదివారం కూడా ఒక సూపర్ ఎపిసోడ్ తో వస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ మాత్రం వెరీ స్పెషల్ అని చెప్పాలి. అనేక మంది సీనియర్ నటుల సమక్షములో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ సినీ ప్రస్థానం 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అంతా కలసి చిన్నపాటి సత్కారం చెయ్యడం ఎంతో ఆనందంగా అనిపించింది.

అలాగే ఈ టైం లో శ్రీదేవి డ్రామా కంపెనీ వారితో అన్నపూర్ణమ్మ పేల్చినా పంచులు కూడా మంచి హైలైట్ అయ్యాయి. అలాగే మరో స్పెషల్ అట్రాక్షన్ ఇందులో ఏమిటంటే నటుడు బాబు మోహన్ పుష్ప హిట్ సాంగ్ శ్రీవల్లి కి స్పెషల్ పెర్ఫామెన్స్ చెయ్యడం అని చెప్పాలి. ఇలా మంచి ఎంటర్టైన్మెంట్ తో ఈ కొత్త ప్రోమో ఆకట్టుకునే విధంగా ఉంది. మరి ఈ స్పెషల్ ఎపిసోడ్ లో ఇంకెన్ని ట్రీట్స్ ఉన్నాయో తెలియాలి అంటే ఈ ఫిబ్రవరి 27 మధ్యాహ్నం 1 గంటకి ఈటీవీలో చూడాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు