‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో సరికొత్త అంత్యాక్షరి.. నవ్వులే నవ్వులు..!

Published on Sep 22, 2021 2:13 am IST


తెలుగు బుల్లితెర‌ ప్రేక్షకులకు కడుపుబ్బా కామెడీని అందిస్తున్న కార్యక్రమాల్లో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కూడా ఒకటి. సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ఈటీవీలో మధ్యాహ్నం 1:00 గంటకు ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 26న ప్రసారంకానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది.

అయితే ప్రోమోలోకి వెళితే హైపర్ ఆది, హిమజ భార్య భర్తలుగా నటిస్తూ నవ్వులు పూయించబోతున్నారు. ఇక ఆటో రాంప్రసాద్, ఆది రెండు టీంలుగా విడిపోయి అంత్యాక్షరి ఆడిన తీరు హిలేరియస్ కామెడీనీ పుట్టించింది. ఇక విష్ణుప్రియ చేసిన డ్యాన్స్‌ ఫెర్ఫార్మెన్స్ మరో లెవల్ అని చెప్పాలి. చివరలో అందరూ కలిసి తీన్మార్ స్టెప్పులు వేయడం కూడా అలరించింది. మరీ ఈ ఫుల్ ఎపిసోడ్‌ను మిస్ కాకూడదంటే మాత్రం రోజు “శ్రీదేవి డ్రామా కంపెనీని” తప్పక చూడాల్సిందే.

ప్రొమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :