‘నువ్వు ఇలియానా కాదమ్మా. జస్ట్‌ అరియానా’ !

Published on Oct 25, 2021 1:00 am IST

‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ షోకి ధారావాహికల్లో మెరిసే నటీమణులు కూడా విచ్చేసి తమదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. అయితే, తాజాగా ఈ షో నుంచి వచ్చిన ప్రోమో ఒకటి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అక్టోబరు 31న ప్రసారంకానున్న ఎపిసోడ్‌ కి సంబంధించిన ప్రోమో ఇది.

‘కార్తీక వనభోజనాలు’ పేరుతో ఈ ఎపిసోడ్‌ పూర్తి వినోదభరితంగా రూపొందింది. ఇక ఈ షోకి అతిథులుగా వచ్చిన లాస్య, అరియానా తదితరులు తమదైన శైలిలో పంచ్‌ లు వేశారు. అయితే, అరియనా ఓ పంచ్ వేస్తూ ‘నేనొచ్చి చాలాసేపయింది. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు ఎవరూ అడగట్లేదే’ అని అక్కడున్న వారి పై అసహనం వ్యక్తం చేయడం, వెంటనే లాస్య ఆ పంచ్ కి కౌంటర్‌ ఇస్తూ.. ‘నువ్వు ఇలియానా కాదమ్మా. జస్ట్‌ అరియానా’ అని చమత్కరించడం మొత్తానికి ప్రోమో బాగా ఆకట్టుకుంది.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :