“శ్రీ దేవి డ్రామా కంపెనీ” లేటెస్ట్ ప్రోమోకి ఒక్క రోజులో భారీ రెస్పాన్స్.!

Published on Jun 1, 2022 5:00 pm IST


తెలుగు స్మాల్ స్క్రీన్ పై నిరంతరం సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని అందించే ఛానెల్స్ లో ఈటీవీ ఛానెల్ స్థానం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో ఒక్కో స్పెషల్ షో మరియు ప్రోగ్రాం లకి ప్రత్యేక ఆదరణ ఉంది. అలాంటి షోలలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి ప్రసారం అయ్యే మోస్ట్ ఎంటర్టైనింగ్ షో “శ్రీదేవి డ్రామా కంపెనీ” కూడా ఒకటి.

మరి దీని నుంచి వచ్చే వారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ తాలూకా ప్రోమో ని రీసెంట్ గా వదలగా దానికి కేవలం ఒక్క రోజులో అంటే 24 గంటల్లో ఏకంగా 50 లక్షలకి పైగా వ్యూస్ వచ్చేసాయి. ఇది ఒక సెన్సేషనల్ రెస్పాన్స్ అని చెప్పాలి. అలాగే దీనితో పాటుగా ఒక లక్ష 29 వేలకి పైగా లైక్స్ కూడా ఈ ప్రోమో కి రావడం విశేషం.

అలరించే స్కిట్లు, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో కనిపిస్తున్న ఈ ప్రోమో ఒక్కరోజులో మాసివ్ రెస్పాన్స్ అందుకొని అదరగొట్టింది. మరి ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ జూన్ 5 మధ్యాహ్నం మీ ఈటీవీలో ఈ ప్రోగ్రాంని మిస్సవ్వకుండా చూడాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :