మెగా డాటర్ నిర్మాణంలో ‘శ్రీదేవి శోభన్‌బాబు’ !

Published on Aug 22, 2021 9:15 am IST

నేడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ రోజు అంతా మెగా అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా చిరుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా చిరు బర్త్ డే సందర్భంగా చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితా కొణిదెల, అల్లుడు విష్ణుప్రసాద్‌ కలిసి అభిమానులకు ఒక స్పెషల్ ట్రీట్ ఇచ్చారు.

తమ నిర్మాణంలో రాబోతున్న తొలి చిత్రం అంటూ ‘శ్రీదేవి శోభన్‌బాబు’ అనే సినిమాని ప్రకటించారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా సంతోష్‌ శోభన్‌, గౌరి జి. కిషన్‌ నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని సుస్మిత తెలియజేశారు.

కాగా మెగా డాటర్ సుస్మిత ఇప్పటికే ‘షూట్‌ అవుట్‌ ఎట్‌ ఆలేరు’ అనే వెబ్‌ సిరీస్‌ ను కూడా నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె చలనచిత్ర నిర్మాణంలో అడుగుపెడుతున్నారు.

సంబంధిత సమాచారం :