డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “శ్రీదేవి సోడా సెంటర్”

Published on Oct 22, 2021 2:11 am IST


సుధీర్ బాబు, ఆనంది లు హీరో హీరోయిన్ లుగా నటించిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయి మంచి విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అయింది.

కరుణా కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను జీ 5 సొంతం చేసుకుంది. ఈ చిత్రం జీ 5 లో నవంబర్ 4 వ తేదీ నుండి ప్రేక్షకులకు అందుబాటులో రానుంది. దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ అందించనుంది. విజయ్ చిల్లా మరియు శశి దేవిరెడ్డి లు నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

More