సెన్సార్ పూర్తి చేసుకున్న “శ్రీదేవి సోడా సెంటర్”

Published on Aug 24, 2021 1:49 pm IST


సుధీర్ బాబు హీరోగా, ఆనంది హీరోయిన్ గా కరుణా కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి లు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఎ ఇవ్వడం జరిగింది.

శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ నుండి గ్లింప్స్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం ఈ నెల 27 వ తేదీ కి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో విడుదల కాబోతుంది. పలాస 1978 తో డైరెక్టర్ తన సత్తా చాటిన కరుణా కుమార్ ఈ సారి సుధీర్ బాబు ను హై ఓల్టేజ్ లైటింగ్ సూరిబాబు పాత్రలో చూపిస్తున్నారు. ఈ సినిమా కి మణిశర్మ సంగీతం అదనపు ఆకర్షణ గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :