బుల్లితెరలోకి వచ్చేస్తున్న “శ్రీదేవి సోడా సెంటర్”..!

Published on Dec 7, 2021 11:04 pm IST


సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 27వ తేదీన థియేటర్లలో విడుదలై, ఆ తర్వాత నవంబర్ 5వ తేదీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది.

పరువు హత్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మ్యూజికల్ హిట్ కావడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలూ పొందింది. అయితే ఈ సినిమా బుల్లితెరలోకి రాబోతుంది. డిసెంబర్ 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కాబోతోంది. థియేటర్లలో, ఓటీటీలో ఈ సినిమాను మిస్ అయిన వారు బుల్లితెరపై వీక్షించొచ్చు.

సంబంధిత సమాచారం :