మందులోడ స్టెప్ ఛాలెంజ్…”శ్రీదేవి సోడా సెంటర్” టీమ్ సరికొత్త ప్రమోషన్స్!

Published on Jul 18, 2021 5:00 pm IST


కరుణా కుమార్ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ గ్లింప్స్, మందులోడ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన ఈ మందులోడ సాంగ్ మాస్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా చిత్రం యూనిట్ దీని పై సరికొత్త ప్రమోషన్స్ షురూ చేసింది.

మందులోడ స్టెప్ ఛాలెంజ్ అంటూ ఒక కార్యక్రమం మొదలు పెట్టింది. మందులోడ పాట ను కంపోజ్ చేసి షేర్ చేస్తే 1,50,000 రూపాయలను గెలవండి అంటూ చిత్ర యూనిట్ అంటుంది. మందులోడ పాట లో ఏవైనా 20 సెకండ్ ల పాటు ఉన్న మ్యూజిక్ బిట్ కి డాన్స్ వేసి #mandhulodastepchallenge , #sridevisodacenter , #ssc అని ట్యాగ్స్ ఉపయోగించి 70 ఎంఎం ఎంటర్ టైన్మెంట్స్ వారిని ట్యాగ్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రతీ రోజు ముగ్గురు విన్నర్స్ 5 వేల రూపాయలను గెలుచుకోవచ్చు అని, అయితే జూలై 21 నుండి ఈ కార్యక్రమం షురూ అవుతుంది అని, 26 వరకు ఇలా కొనసాగుతుంది అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :