
‘ఇంగ్లీష్ వింగ్లిష్’ సినిమాతో చాలా రోజుల తర్వాత వెండితెరపై అతిలోక సుందరి శ్రీదేవి రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఇళయ దళపతి విజయ్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి రెడీ అయ్యింది. చింబుదేవన్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తున్న సినిమాలో రాజమాత పాత్రలో శ్రీదేవి నటిస్తుంది. హన్సిక తల్లి పాత్రలో కనిపించనుంది. నవంబర్ 10 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యె ఈ సినిమాలో శృతి హాసన్ మరొక హీరోయిన్. ‘ఈగ’ ఫేం సుదీప్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
హిందీలో తెరకెక్కిన ‘ఇంగ్లీష్ వింగ్లిష్’ సినిమా తెలుగు, తమిళ భాషలలో పాటు జపనీస్ తదితర విదేశీ భాషలలో డబ్ అయ్యి ఘనవిజయం సాధించింది. శ్రీదేవి నటనకు మంచి ప్రసంశలు లభించాయి.