రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న “కోతల రాయుడు”..!

Published on Jan 30, 2022 1:00 am IST

శ్రీకాంత్ హీరోగా సుధీర్ రాజు దర్శకత్వంలో ఎ.ఎస్.కిశోర్, కొలన్ వెంకటేశ్ నిర్మించిన చిత్రం “కోతల రాయుడు”. ఇందులో శ్రీకాంత్ సరసన డింపుల్ చోప్డా, నటాషా దోషి, ప్రాచీ సిన్హా కథానాయికలుగా నటించారు. దాదాపు రెండేళ్ళ క్రితం మొదలై, కరోనా కారణంగా విడుదల కాకుండా ఆగిపోయిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘యు’ సర్టిఫికెట్ పొందింది.

అయితే తాజాగా ఈ చిత్రం కూడా రిలీజ్ డేట్‌ని లాక్ చేసుకుంది. ఫిబ్రవరి 4న “కోతల రాయుడు”ను థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. మాటలతో మాయచేసే పాత్రను శ్రీకాంత్ చేస్తున్నాడని, అందుకే ఈ చిత్రానికి ‘కోతల రాయుడు’ అనే టైటిల్ పెట్టినట్టు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల బాలకృష్ణ-బోయపాటి ‘అఖండ’లో ప్రతినాయకుడిగా నటించి మెప్పించిన శ్రీకాంత్ ఇప్పుడు ‘కోతల రాయుడు’గా ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :