‘చరణ్ – శంకర్’ సినిమాలో కొత్త శ్రీకాంత్‌ని చూస్తారట !

Published on Jan 23, 2022 10:53 pm IST

క్రేజీ డైరెక్టర్ శంకర్ – మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో ఓ కీలక పాత్రలో హీరో శ్రీకాంత్ నటించబోతున్నాడు. కాగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. నా పాత్రను చూసి ప్రతి ఒక్కరు షాకవుతారు. అసలు ఇతను శ్రీకాంతేనా? అని అందరూ ప్రత్యేకంగా నా పాత్ర గురించి మాట్లాడుకుంటారు. ఈ సినిమాలో కచ్చితంగా కొత్త శ్రీకాంత్‌ని చూస్తారు’ అని శ్రీకాంత్‌ చెప్పుకొచ్చాడు.

మరి ఈ పాత్ర ద్వారా శ్రీకాంత్‌ ఎలా మెప్పిస్తారో చూడాలి. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో చరణ్ పాత్ర వెరీ పవర్ ఫుల్ గా ఉండనుంది. నిజానికి సహజంగానే తన సినిమాల్లో హీరోల్ని డిఫరెంట్ గెటప్స్ అండ్ మేకప్స్ తో చూపించే ఆనవాయితీ ఉన్న శంకర్, ఈ సినిమాలో కూడా చరణ్ ను అలాగే వినూత్నంగా చూపించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ నటి ఇషా గుప్తా కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనుందట.

సంబంధిత సమాచారం :