శంకర్ సినిమాలో కూడా ఊహించని మేకోవర్ లోనే శ్రీకాంత్!

Published on Oct 2, 2021 10:02 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఐకానిక్ దర్శకుడు శంకర్ ల కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం ఇటీవల అనౌన్స్ అయ్యి స్టార్ట్ అయ్యిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. మరి దీనితో పాటుగా శంకర్ తన మార్క్ లో ఒక సాలిడ్ పోస్టర్ ని కూడా డిజైన్ చేయించి వదిలారు. దీనిలో సినిమా కాస్ట్ సహా ఇతర టెక్నీకల్ టీం కూడా కనిపించారు. దీనితో దీనికి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమాలో సీనియర్ నటుడు శ్రీకాంత్ కూడా ఒక కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపైనే శ్రీకాంత్ కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం తాను చేసిన అఖండ సినిమాలో రోల్ ఎంత క్రూరంగా చాలా కొత్తగా ఉంటుందో అలానే శంకర్ తో సినిమాలో కూడా తన రోల్ చాలా కొత్తగా ఉంటుందట.

రెండు షేడ్స్ లో కనిపిస్తానని ఒక యంగ్ వెర్షన్ లో ఉంటే మరొకటి ఓల్డ్ లుక్ లో ఉంటుంది అని శ్రీకాంత్ తెలిపారు. దీనితో శంకర్ శ్రీకాంత్ తో సినిమాలో ఓ సాలిడ్ రోల్ నే ప్లాన్ చేసినట్టు ఉన్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా కియారా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే దిల్ రాజు ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :