వైరల్ వీడియో : ఫ్యాన్స్ కోసం థియేటర్ లో టికెట్ కలెక్టర్ గా మారిన శ్రీలీల

వైరల్ వీడియో : ఫ్యాన్స్ కోసం థియేటర్ లో టికెట్ కలెక్టర్ గా మారిన శ్రీలీల

Published on Dec 16, 2022 11:00 PM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ధమాకా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఎంతో ప్రతిష్టాత్మకముగా రూపొందిన ఈ మూవీలో రవితేజ డ్యూయల్ రోల్ చేయగా శ్రీలీల హీరోయిన్ గా నటించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించిన ఈ మూవీ డిసెంబర్ 23న ప్రేక్షకులు ముందుకి రానున్న సందర్భంగా ఇప్పటికే పలు ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించిన యూనిట్, లేటెస్ట్ గా నేడు హైదరాబాద్ లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో ఆడియన్స్, ఫ్యాన్స్ తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు.

కాగా ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీలీల పాల్గొని ఫ్యాన్స్ తో ఎంతో సరదాగా మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. అందులో భాగంగా ధమాకా మూవీ అడ్వాన్స్ టికెట్స్ ని కొనుగోలు చేసిన ఫ్యాన్స్ కి అందులోని మూవీ థియేటర్ కౌంటర్ ద్వారా అందించారు శ్రీలీల. కాగా ఎంతో సరదాగా ఫుల్ జోష్ తో ఆకట్టుకునే రీతిన సాగిన ధమాకా మీట్ అండ్ గ్రీట్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నివర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఈ మూవీని హీరో రవితేజ గారు సహా యూనిట్ మొత్తం ఎంతో కష్టపడి తెరకెక్కించాం అని, తప్పకుండా రిలీజ్ తరువాత ధమాకా అందరి అంచనాలు అందుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు యూనిట్ సభ్యులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు