
సూపర్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానుల దాహాన్ని తీరుస్తూ, బాక్స్ ఆఫీసు వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా కూడా నిలిచేలా సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన సినిమా ‘శ్రీమంతుడు’. ఆగష్టు 7న మహేష్ బాబు బర్త్ డే కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా నేటికి నెల రోజులు పూర్తి చేసుకున్నా సక్సెస్ఫుల్ గా థియేటర్స్ లో నడుస్తోంది. ఐదవ వీకెండ్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో టాలీవుడ్ అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్టు లో రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. కేవలం లోకల్ లోనే కాకుండా మహేష్ బాబుకి స్ట్రాంగ్ బిజినెస్ బేస్ ఉన్న ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా రికార్డ్స్ సృష్టిస్తోంది.
యుఎస్ లో ఫస్ట్ వీక్ లోనే శ్రీమంతుడు సినిమా $2మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి మహేష్ బాబు కెరీర్లో 2 మిలియన్ మార్క్ క్రాస్ చేసిన మొదటి సినిమాగా రికార్డ్ సృష్టించిన విషయం ఇది వరకే తెలియజేశాం. తాజాగా శ్రీమంతుడు ఓవర్సీస్ లో మరో రికార్డ్ కి సిద్దమైంది. మొదటి 31 రోజుల్లో అనగా ఐదవ వీకెండ్ ముగిసే సమయానికి $2.87 మిలియన్స్ షేర్ కలెక్ట్ చేసింది. మరి కొద్ది రోజుల్లో ఓవర్సీస్ లో శ్రీమంతుడు సినిమా కచ్చితంగా 3 మిలియన్ మార్క్ ని టచ్ చేసి, సరికొత్త రికార్డ్ ని సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.