తనకు డ‌బ్బే కావాలంటున్న పాన్ ఇండియా హీరోయిన్ !

Published on May 26, 2022 10:54 pm IST


శ్రీ‌నిధి శెట్టి `కేజీఎఫ్‌` సినిమాతో దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి భారీ ఆఫ‌ర్లు వస్తున్నాయి. ఇక శ్రీ‌నిధి శెట్టి ఇటీవల ఒక ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో సదరు యాంకర్ ‘మీకు పేరు కావాలా ? లేక, డబ్బు కావాలా ? అంటూ ఒక ప్రశ్న అడిగాడు. ఈ రెండిటిలో శ్రీ‌నిధి శెట్టి చాలా ఓపెన్ గా ‘నాకు డ‌బ్బే కావాలంటూ మొహమాటం లేకుండా చెప్పింది.

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టిని హీరోయిన్‌ గా తీసుకుంటే బాగుంటుందని తారక్ ఫాన్స్ కోరుకుంటున్నారు. మరి, ప్రశాంత్ నీల్‌ శ్రీనిధికి మరో క్రేజీ ఆఫర్ ఇస్తాడా ? చూడాలి. అన్నట్టు డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘లైగర్’. ఈ సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ కోసం శ్రీనిధి శెట్టిని సంప్రదించారని.. శ్రీనిధి శెట్టి లైగర్‌ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుందని గతంలో వార్తలు వచ్చాయి.

సంబంధిత సమాచారం :