‘లైగర్‌’ స్పెషల్ సాంగ్ లో కేజీఎఫ్ హీరోయిన్ ?

Published on Feb 22, 2022 12:00 am IST

యుంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి లైగర్‌ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుందని వార్తలు వస్తున్నాయి. కాగా డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ కోసం శ్రీనిధి శెట్టిని సంప్రదించారని తెలుస్తోంది. కేజీఎఫ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి, మరి నిజంగానే లైగర్ లో నటించిందా ? లేదా ? అనేది చూడాలి.

కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. లైగర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాలా రోజుల నుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :