మరోసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకొనున్న స్టార్ కమెడియన్ !
Published on Nov 10, 2016 1:59 pm IST

jayam-nistayambu-ra
ఈ మధ్య కాలంలో స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో శ్రీనివాస్ రెడ్డికూడా ఒకరు. మంచి కామెడీ టైమింగ్, హావభావాలతో మంచి కామెడీని పండించగల శ్రీనివాస్ రెడ్డి సోలో హీరోగా నిలబడాలన్న తన ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. ఈ మధ్య ‘గీతాంజలి’ వంటి హర్రర్ కామెడీ సినిమా చేసి హీరోగా తోలి ప్రయత్నంలోనే మంచి మార్కులు తెచ్చుకున్న శ్రీనివాస్ రెడ్డి కాస్త గ్యాప్ తీసుకుని తాజాగా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ పేరుతో మరో సినిమా చేశారు.

ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 24న విడుదలకానుంది. విడుదలైన ట్రైలర్ బాగాఉండటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. నిర్మాత నీలం కృష్ణా రెడ్డి, జయమ్ము నిశ్చయమ్మురా సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ మొత్తాన్నీ సుమారు 7 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఇంట హైప్ ఉన్న ఈ చిత్రంతో హీరోగా బలంగా నిలదొక్కుకోవాలని శ్రీనివాస్ రెడ్డి అనుకుంటున్నాడు. ఆయన అనుకున్నట్టే సినిమా హిట్టయితే చిన్న నిర్మాతలపాలిటి మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిలబడిపోతాడు ఈ స్టార్ కమెడియన్. పూర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్సకుడు శివరాజ్ కనుమూరి డైరెక్ట్ చేస్తున్నాడు.

 
Like us on Facebook