యాక్షన్ హీరోతో నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసిన శ్రీను వైట్ల

Published on Oct 6, 2022 2:00 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు తో దూకుడు, రామ్ తో రెడీ, ఎన్టీఆర్ తో బాద్షా వంటి సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ శ్రీను వైట్ల ఇటీవల రవితేజ తో అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక గత కొన్నాళ్లుగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కసరత్తు చేసిన శ్రీనువైట్ల లేటెస్ట్ గా ఆ మూవీని యాక్షన్ హీరో గోపీచంద్ తో చేయబోతున్నట్లు నేడు అనౌన్స్ చేసారు.

నేడు దసరా పర్వదినం సందర్భంగా శ్రీను వైట్ల తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. గతంలో శ్రీను వైట్ల తో వర్క్ చేసిన గోపి మోహన్ కూడా ఈ క్రేజీ ప్రాజక్ట్ లో పనిచేయనుండగా దీనికి సంబందించిన పూర్తి వివరాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి. ఇక ప్రస్తుతం గోపీచంద్, శ్రీవాస్ తో ఒక యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :