శ్రీను వైట్లకు అవకాశం ఇస్తున్న ఆ యంగ్ హీరో ఎవరు ?

వరుస పరాజయాల్లో ఉన్న దర్శకుడు శీను వైట్ల గత ప్రయత్నం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. దీంతో దాదాపు స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన ఆయనకు అవకాశాలు బాగా తగ్గాయి. హీరోలెవరూ ఆయనతో వర్క్ చేయడానికి సుముఖంగా లేరనేది ఇండస్ట్రీ టాక్. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయనతో ఒక యంగ్ హీరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడట.

ఇంతకీ హీరో ఎవరనుకుంటున్నారా.. అతనే బెల్లంకొండ శ్రీనివాస్. ఈయన కూడా చాలా పరాజయాలు చూసి ఈమధ్యే హిట్ అందుకుని ఇప్పుడు సంతోష్ శ్రీనివాస డైరెక్షన్లో కొత్త సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తికాగానే శ్రీను వైట్ల ప్రాజెక్ట్ మొదలవుతుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతమేర వాస్తవముందో తెలియాలంటే బెల్లంకొండ శ్రీనివాస్ లేదా శ్రీను వైట్లలో ఎవరో ఒకరు స్పందించే వరకు ఆగాల్సిందే.

Exit mobile version