మహేష్ కి స్పెషల్ థాంక్స్ చెప్పిన శ్రీను వైట్ల

srinu-vaitla
సూపర్ స్టార్ మహేష్ బాబుతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ శ్రీను వైట్ల జర్నీ ‘దూకుడు’ తో మొదలైంది అక్కడి నుంచి వారి జర్నీ ఆగకుండా ట్రావెల్ అవుతూ వస్తోంది. దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘ఆగడు’. ఈ సినిమా సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. మొదటి నుంచి తనని ఎంతో సపోర్ట్ చేసి ప్రోత్సహిస్తూ వస్తున్న మహేష్ బాబుకి శ్రీను వైట్ల కృతఙ్ఞతలు తెలుపడమే కాకుండా మహేష్ ని తెగ పొగిడేస్తున్నాడు.

‘దూకుడు నుంచి నాకు సపోర్ట్ చేస్తూ, నా నుంచి బెస్ట్ ఇచ్చేలా ఎంకరేజ్ చేస్తున్న మహేష్ బాబుకి నా స్పెషల్ థాంక్స్. గత కొన్ని సంవత్సరాలుగా మీతో అవుతున్న ట్రావెలింగ్ ని అదృష్టంగా భావిస్తున్నాను. త్వరలోనే మరో ప్రాజెక్ట్ తో మీతో వర్కౌట్ చేయాలనుకుంటున్నాను. అలాగే సెప్టెంబర్ 19న ఆగడుతో వండర్ఫుల్ మోమెంట్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాను.. లవ్ యు మహేష్ బాబు’ అని శ్రీను వైట్ల ట్వీట్ చేసాడు.

ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. నిన్ననే మహేష్ బాబు కూడా తన పార్ట్ కి డబ్బింగ్ పూర్తి చేసాడు. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version