అదిరిపోయే రేటు పలికిన ‘శ్రీరస్తు శుభమస్తు’ శాటిలైట్ రైట్స్

Srirastu-subamastu
‘అల్లు శిరీష్’ చాన్నాళ్ల తరువాత ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ‘పరశురాం’ దర్శకత్వంలో ఏంటో క్వాలిటీగా నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం తాలూకు శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఈ రైట్సును ‘జెమినీ టీవీ’ రూ.3 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

ఈ భారీ మొత్తంతో సినిమా సగం బడ్జెట్ కవరైపోయింది. విడుదలైన మొదటి రోజు నుండే మంచి పాజిటివ్ టాక్ తో నడుస్తుండటం, ఫ్యామిలీ ఆడియన్స్ సైతం సినిమాను ఆదరిస్తుండటంతో జెమినీ టీవీ ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించింది. ‘శిరీష్’ కొత్త మేకోవర్, ‘లావణ్య త్రిపాఠి’ నటన, ‘థమన్’ సంగీతం వంటి అంశాలు ‘పరశురామ్’ కొత్త తరహా స్క్రీన్ ప్లేకి తోడవడంతో ఈ సినిమా ఇంతటి విజయాన్ని సొంతం చేసుకుంది.