రేపే విడుదల కానున్న ‘శ్రీరస్తు శుభమస్తు’ టైటిల్ సాంగ్

19th, July 2016 - 08:35:53 AM

sreerasthu-m
గౌరవం, కొత్త జంట సినిమాల తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ‘అల్లు శిరీష్’ హీరోగా నిలదొక్కుకోవడానికి సోలో వంటి ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించిన దర్శకుడు ‘పరశురాం’ దర్శకత్వంలో ‘శ్రీరస్తు శుభమస్తు’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబందించిన ప్రమోషన్లను ప్రారంభించిన చిత్ర టీమ్ రేపు జూలై 20న టైటిల్ సాంగ్ ఆడియో, వీడియోని విడుదల చేయనున్నారు.

ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగష్టు 5న విడుదలకావడానికి సిద్ధంగా ఉంది. పూర్తి కుటుంబ విలువలతో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో అల్లు శిరీష్ సరసన ‘లావణ్య త్రిపాఠి’ హీరోయిన్ గా నటిస్తుండగా ‘రావు రమేష్’ వంటి సీనియర్ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఎస్ఎస్ .థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది.