పుష్ప నుండి “శ్రీవల్లి” ఫుల్ వీడియో సాంగ్ విడుదల!

పుష్ప నుండి “శ్రీవల్లి” ఫుల్ వీడియో సాంగ్ విడుదల!

Published on Jan 4, 2022 9:02 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం పుష్ప ది రైజ్. ఈ చిత్రం ను మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా సంయుక్తం గా నిర్మించడం జరిగింది. థియేటర్ల లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. మొత్తానికి ఈ చిత్రం 2021 కి బ్లాక్ బస్టర్ గా నిలిచింది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా ఈ చిత్రం నుండి శ్రీ వల్లి ఫుల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పాట విడుదల అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. యూ ట్యూబ్ లో సైతం మంచి వ్యూస్ తో దూసుకు పోతుంది. ఈ చిత్రం లో అన్ని పాటలు సైతం సూపర్ హిట్ గా నిలిచాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి చంద్రబోస్ పాటలు రాయడం జరిగింది. అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక మందన్న నటించగా, సునీల్, అనసూయ భరద్వాజ్, ఫాహద్, ధనంజయ, అజయ్ ఘోష్ లు కీలక పాత్రల్లో నటించారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు