సిద్ శ్రీరామ్ వాయిస్ తో వావ్ అనిపించేలా “శ్రీవల్లి” సాంగ్!

Published on Oct 13, 2021 11:32 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం పుష్ప ది రైస్ అంటూ ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర లో ఊర మాస్ పాత్ర లో నటిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక నటిస్తుంది. ఈ చిత్రం లో రష్మీక శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి శ్రీవల్లి అంటూ ఒక సాంగ్ విడుదల అయింది. ఈ పాటను సిద్ శ్రీరామ్ నాలుగు బాషల్లో పాడటం జరిగింది. చంద్రబోస్ రాసిన ఈ పాట, సిద్ శ్రీరామ్ వాయిస్, అల్లు అర్జున్ మెలోడియస్ ఎక్స్ ప్రెషన్స్ తో పాట వావ్ అనేలా ఉంది. సుకుమార్ సరికొత్తగా ఈ పాటను ప్రజెంట్ చేయడం జరిగింది.

ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ముత్తం శెట్టి మీడియా తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో ఫాహద్ ఫజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటుగా హిందీ లో కూడా ఈ చిత్రం విడుదల అవుతుంది. దేవి శ్రీ ప్రసాద్, సుకుమార్ మరియు అల్లు అర్జున్ కాంబో లో వస్తున్న చిత్రం కావడంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :