శ్రీవల్లి దూకుడు..యూ ట్యూబ్ ను షేక్ చేస్తున్న పుష్ప మానియా!

Published on Oct 14, 2021 10:45 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ చిత్రం ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి భాగం పుష్ప ది రైస్ పేరిట డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం లో ఊర మాస్ గెటప్ లో అల్లు అర్జున్ కనిపిస్తున్నారు. స్మగ్లింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు విడుదల అయి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి నిన్న శ్రీవల్లి లిరికల్ సాంగ్ విడుదల అయ్యింది. ఈ చిత్రం నుండి విడుదల అయిన మరొక సాంగ్ 24 గంటల్లో 6.9 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాక 499కే లైక్స్ ను సాధించడం జరిగింది. ఈ పాట లో అల్లు అర్జున్ డాన్స్ స్టీల్ చాలా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక మండన్న నటిస్తుంది. రష్మిక లుక్ సైతం ప్రేక్షకులను అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం లో ఫాహద్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :