“పుష్ప” నుండి శ్రీవల్లి సాంగ్ ప్రోమో విడుదల!

“పుష్ప” నుండి శ్రీవల్లి సాంగ్ ప్రోమో విడుదల!

Published on Oct 12, 2021 12:23 PM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం పుష్ప ది రైస్ ను డిసెంబర్ 17 వ తేదిన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ మొత్తంశెట్టి మీడియా తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, టీజర్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం నుండి శ్రీవల్లి సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ పాట రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పాటను నాలుగు బాషల్లో సిద్ శ్రీరామ్ పాడగా, హిందీ లో మాత్రం జావేద్ అలీ పాడటం జరిగింది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. మళయాళ నటుడు ఫాహద్ ఈ చిత్రం లో విలన్ పాత్ర లో నటిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక నటిస్తుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన అన్ని అప్డేట్స్ కూడా భారీ ఆదరణ దక్కించుకోవడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సాంగ్ ప్రోమో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు