‘దున్కీ’ పై ఫ్యాన్స్ కి హామీ ఇచ్చిన షారుఖ్ ఖాన్

Published on Sep 22, 2023 11:30 pm IST

బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇటీవల జవాన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఇప్పటికే రూ. 900 కోట్ల గ్రాస్ దాటి రూ. 1000 కోట్లకి చేరువ అవుతున్న జవాన్ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఇంకా దూసుకెళుతోంది. అట్లీ తెరకెక్కించిన ఈ మూవీలో దీపికా పదుకొనె, నయనతార హీరోయిన్స్ గా నటించారు.

మరోవైపు ఇటీవల పఠాన్ మూవీతో కూడా రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్ అందుకున్నారు షారుఖ్. అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దున్కీ. క్లాస్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ డిసెంబర్ 22న విడుదల కానుంది. అయితే తాజాగా తన ఫ్యాన్స్ తో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో చాట్ సెషన్ నిర్వహించారు షారుఖ్.

అందులో భాగంగా ఒక ఫ్యాన్ ఈ విధంగా అడిగారు. ఇప్పటివరకు క్లాస్, మాస్ సినిమాలతో మీరు అలరించారు, మరి దున్కీ నుండి మేము ఏమి ఆశించవచ్చు అని అడిగిన ప్రశ్నకు షారుఖ్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. నిజానికి దున్కీ కి రాజ్ కుమార్ హిరానీ అనే పేరు జత చేయబడి ఉంది, అంతకు మించి మీకు ఏమి కావాలి అంటూ షారుఖ్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా దీనిని బట్టి తాను హ్యాట్రిక్ హిట్ కొట్టబోతున్నట్లు ఫ్యాన్స్ కి ఒకింత హామీ ఇచ్చారు హీరో షారుఖ్ ఖాన్.

సంబంధిత సమాచారం :