సెన్సేషన్ వసూళ్లతో “జవాన్”

Published on Sep 12, 2023 6:30 pm IST

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం సోమవారం నాడు హిందీ లో మరో 30 కోట్ల రూపాయలకి పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా ఇప్పటి వరకూ హిందీలో 282 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు చేయడం జరిగింది.

తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఈ సినిమా 300 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం జోరు చూస్తుంటే, ఈజీగా పఠాన్ రికార్డులను బ్రేక్ చేసేలా కనిపిస్తుంది. నయనతార, ప్రియమణి, సంజయ్ దత్, యోగి బాబు, దీపికా పదుకునే తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :